కండలు చూపించిన మానస్...ఏఎస్ఎంపి షోలో అందరికీ అవార్డ్స్!
on Feb 26, 2024
ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో ఈ వారం ఆడియన్స్ ని బాగా ఎంటర్టైన్ చేసింది. ఈ షో 75 ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ షోకి వచ్చే పార్టిసిపెంట్స్ కి స్పెషల్ గా అవార్డ్స్ కూడా ఇచ్చారు. ఐతే ఈ షోకి ఎవరెవరు ఎన్ని సార్లు వచ్చారు ఏ అవార్డ్స్ అందుకున్నారో చూద్దాం. కౌశిక్ ఈ షోకి 8 సార్లు వచ్చారు. ఈయనకు ఆదివారం విత్ స్టార్ మా పరివారం (ఏఎస్ఎంపి) రేలంగి మావయ్య అవార్డు అందించింది శ్రీముఖి. నటి ప్రేరణ 9 సార్లు ఈ షోకి వచ్చింది. ఈమెకు బాడీ బిల్డింగ్ అవార్డు, 9 సార్లు వచ్చిన హమీదకు బెస్ట్ హాటీ అవార్డు , నాగపంచమి హీరో-హీరోయిన్స్ ఇద్దరూ కలిపి 19 సార్లు ఈ షోకి వచ్చి ఎంటర్టైన్మెంట్ అందించినందుకు క్యూట్ పెయిర్ అవార్డు ఇచ్చింది శ్రీముఖి.
తర్వాత కార్తీక దీపం సీరియల్ డాక్టర్ బాబు అలియాస్ నిరుపమ్ ఈ షోకి 10 సార్లు వచ్చినందు పెదరాయుడు అవార్డుని , శివ్ కుమార్ 11 సార్లు వచ్చినందుకు గుడ్డులో అవార్డుని, అంబటి అర్జున్ 14 సార్లు వచ్చినందుకు నంబర్ 2 అవార్డును , సుహాసిని 15 సార్లు వచ్చి పరివారం బ్యాంకు నుంచి ఎప్పుడూ ఎంతో కొంత డబ్బు తెచ్చినందుకు లక్కీ లక్ష్మి అవార్డు, లాస్య 16 సార్లు వచ్చి తన పాటలతో అందరినీ భయపెట్టినందుకు సూపర్ సింగర్ అవార్డును, దీపికా రంగరాజు 16 సార్లు వచ్చి కరెక్ట్ సింక్ లో డాన్స్ చేయనందుకు బెస్ట్ డాన్సర్ అవార్డుని, మానస్ 17 సార్లు ఈ షోకి టాప్ ప్లేస్ లో నిలిచినందుకు రెగ్యులర్ ఆర్టిస్ట్ అవార్డుని అందించారు. ఇలా ఈ వారం ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోలో శ్రీముఖి అందరినీ ఎంటర్టైన్ చేసింది. ఇక ఈ షోలో మానస్ కి ఒక టాస్క్ ఇచ్చింది. బాడీ బిల్డింగ్ చేస్తూ ఉంటాడు కాబట్టి ఆ కండల్ని చూపించాలి అనేసరికి మానస్ సల్మాన్ ఖాన్ లా చొక్కా విప్పేసి మరీ కండల్ని చూపించి రాంప్ వాక్ చేసాడు. విప్పేసిన చొక్కా బ్రహ్మముడి సీరియల్ నటి దీపికా క్యాచ్ పట్టుకుంది..

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
